అబుదాబిలో 60 మంది డ్రైవర్లకు బహుమతులు అందజేత..!!

- February 05, 2025 , by Maagulf
అబుదాబిలో 60 మంది డ్రైవర్లకు బహుమతులు అందజేత..!!

యూఏఈ: అబుదాబి పోలీసుల హ్యాపీనెస్ పెట్రోల్ పేరిట ఎమిరేట్‌లోని అరవై మంది వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.  సానుకూలతను వ్యాప్తి చేయడం, రహదారి భద్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా యూఏఈ అధికారులు ట్రాఫిక్ నియమాలను పాటించే డ్రైవర్లకు రివార్డ్ అందజేశారు. గతంలో ఉచిత ఇంధన కార్డులను వాహనదారులకు అందించారు. కొందరికి 'స్టార్ ఆఫ్ హానర్' బ్యాడ్జీలు, మరికొందరికి భారీ టీవీ సెట్లు అందించారు.   అల్ ఐన్‌లో తాజాగా హ్యాపీనెస్ పెట్రోలింగ్ చొరవలో భాగంగా డ్రైవర్లకు బహుమతులు అందజేశారు. 

"అబుదాబి పోలీసులు సురక్షితంగా డ్రైవింగ్ చేసే వారికి బహుమతులు అందజేయడం కొనసాగిస్తారు. తద్వారా వారు ఇతరులకు రోల్ మోడల్‌గా ఉంటారు" అని అల్ ఐన్ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ పెట్రోల్‌లోని డిప్యూటీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అఫైర్స్ నుండి మేజ్ మటర్ అబ్దుల్లా అల్ ముహిరి అన్నారు. రోడ్లను సురక్షితంగా మార్చడంలో డ్రైవర్ల నిబద్ధతను ప్రశంసించారు. "ఇటువంటి కార్యక్రమాలు ప్రమాదాలను తగ్గించడానికి మరియు ప్రాణాలను రక్షించడంలో సహాయపడతాయి" అని అల్ ఐన్‌లోని ట్రాఫిక్, సెక్యూరిటీ పెట్రోల్ విభాగం డైరెక్టర్ కల్నల్ జబర్ సయీదాన్ మన్సూరి అన్నారు. ఇతర ఎమిరేట్స్‌లోని పోలీసు బలగాలు కూడా సురక్షితమైన డ్రైవర్లను గౌరవించాయి. దుబాయ్‌లో గత మూడేళ్లుగా ఒక్క ట్రాఫిక్ నేరం లేదా ప్రమాదానికి కారణం కాని 22 మంది వాహనదారులను గుర్తించి సన్మానించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com