తాజా ఆవిష్కరణలకు కేరాఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ 2025..!!
- February 06, 2025
మస్కట్: కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ (SQU).. ఫిబ్రవరి 10 నుండి “ఇన్నోవేషన్ అండ్ మోడరన్ టెక్నాలజీస్: అవకాశాలు, సవాళ్లు” అనే థీమ్‌తో “మెడికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ 2025” పేరుతో 2 రోజుల సమావేశాన్ని నిర్వహించనుంది. వైద్య విద్యలో విజ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుందని SQU కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ (మెడికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ చైర్మన్ 2025) డీన్ ప్రొఫెసర్ రషీద్ ఖల్ఫాన్ అల్ అబ్రి ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య విద్యలో వినూత్న ఆలోచనలు,ఆధునిక పద్ధతులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందరూ వీటిపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ఈ సమావేశానికి యునైటెడ్ స్టేట్స్, కెనడా,నెదర్లాండ్స్ నుండి ఐదుగురు ప్రముఖ వక్తలు హాజరవుతారని, వీరు వైద్య విద్యలో తాజా పరిణామాలు, ఆవిష్కరణలను తెలియజేస్తారని పేర్కొన్నారు.డిస్టెన్స్ మోడ్, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలు, వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం సహా వైద్య విద్యలో తాజా పోకడలను ప్రతిబింబించే అనేక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావన ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







