యూఏఈలో ఎవరైనా Dh100 మిలియన్ జాక్‌పాట్ గెలుస్తారు..!!

- February 06, 2025 , by Maagulf
యూఏఈలో ఎవరైనా Dh100 మిలియన్ జాక్‌పాట్ గెలుస్తారు..!!

యూఏఈ: ఎవరైనా "ఖచ్చితంగా" Dh100-మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుస్తారని యూఏఈ లాటరీ ఆపరేటర్ డైరెక్టర్ తెలిపారు. ఇది ఒక గేమ్ అని  యూఏఈ లాటరీని నిర్వహించే ది గేమ్‌లో లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు. ఎవరైనా జాక్‌పాట్ కొట్టే వరుసలో రెండు లేదా మూడు డ్రాలు ఉంటాయని, యూఏఈలో ఎవరైనా ఖచ్చితంగా Dh100 మిలియన్లను గెలుస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం, జాక్‌పాట్‌ను గెలుచుకునే అవకాశం 8 మిలియన్ల మందికి ఉందన్నారు.

జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఈ లాటరీని గత సంవత్సరం చివర్లో ప్రారంభించారు. గత నాలుగు డ్రాలలో, 60,000 మంది వ్యక్తులు వివిధ మొత్తాలలో డబ్బును గెలుచుకున్నారు. 41 మంది వ్యక్తులు Dh100,000 తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఒక వ్యక్తి Dh1 మిలియన్ గెలుచుకున్నారు.  యూఏఈ లాటరీ కిరాణా, ఇంధన స్టేషన్లలో రాఫెల్ టిక్కెట్లను విక్రయించే ప్రక్రియలో ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం, టిక్కెట్లను దాని వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చని, కంపెనీ త్వరలో ఒక యాప్‌ను కూడా విడుదల చేయనుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com