ఓవర్టేకింగ్ కారణంగా అనేక కార్లు క్రాష్..!!
- February 08, 2025
యూఏఈ: ప్రమాదకరమైన ఓవర్ టేకింగ్ కారణంగా పలు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ మేరకు ప్రమాద విజువల్స్ అబుదాబి పోలీసు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఒక వ్యాన్ అదుపుతప్పి కారును ఢీకొనడంతో రెండుసార్లు పల్టీలు కొట్టడం ఆ వీడియోల్లో కనిపించింది. తాజాగా పోలీసులు షేర్ చేసిన 51 సెకన్ల వీడియోలో, అబుదాబి పోలీసులు వాహనదారులను ముఖ్యంగా లేన్లను మార్చేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. అనేక కార్లు ఢీకొన్న మూడు ప్రమాదాలను అందులో విడుదల చేశారు.బాధ్యతా రహితంగా ఓవర్టేకింగ్ చేస్తే 600 దిర్హామ్ల నుండి Dh1,000 వరకు డ్రైవర్ కు జరిమానా విధించడంతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తారు. ఓవర్టేక్ చేసే ముందు లేదా లేన్లను మార్చే ముందు రోడ్డు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని అబుదాబి పోలీసులు డ్రైవర్లను కోరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







