తిరుపతి స్థానికులకు రేపు దర్శన టోకెన్లు జారీ..
- February 08, 2025
తిరుపతి: తిరుపతి వాసులకు టీటీడీ ఈనెల 11న శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఆ దర్శన టికెట్ టోకెన్లను రేపు(ఫిబ్రవరి 9న) జారీ చేయనుంది.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా కింద ప్రతి నెలా మొదటి మంగళవారం టోకెన్లు జారీ చేస్తుండగా..ఈ నెలలో రథసప్తమి కారణంగా రెండో మంగళవారానికి టీటీడీ వాయిదా వేడింది.
రేపు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం కోటా టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని టీటీడీ సూచించింది. అలాగే టోకెన్లు పొందిన తర్వాత దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







