క్యారట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్
- July 01, 2016
కావాల్సిన పదార్థాలు:
కేరట్ - 2
స్వీట్ కార్న్ - 50 గ్రా
గుడ్లు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు, నూనే - తగినంత
తయారి విధానం:
ఈ ఆమ్లెట్ తయారి కోసం ముందుగా స్వీట్ కార్న్ ని ఉడికించి ఉంచుకోవాలి. కేరట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ మూడింటిని సన్నగా తరుగుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి కాగాకా ఉల్లిమిక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అందులో కేరట్ తురుము కూడా కలిపి 2 నిమిషాల తరువాత ఉప్పు కొత్తిమీర తరుగు వేసి ఆఖరుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని వేసి అంతా బాగా కలిపి దించెయ్యాలి. ఇప్పుడొక గిన్నెలో గుడ్లు పగలకొట్టి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసి కాస్త కాలాకా దాని మీద మనం ముందుగా సిద్దం చేసుకున్నకేరట్ , స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి పూర్తిగా కాలాకా రెండో వైపు తిప్పకుండా తీసెయ్యాలి. ఇలాంటి ఆమ్లెట్ వద్దనే పిల్లలు కూడా ఉండరు. మీరే ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







