ఘనంగా ఇఫ్తార్ నిర్వహించిన తెలుగు దేశం పార్టి కువైట్
- July 01, 2016
కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ కువైట్ ముస్లిం సోదరుల కోసం హవల్లీ లోని అవంతి పాలస్ హోటల్ నందు ఘనంగా ఇఫ్తార్ ను నిర్వహించినది. ఇండియన్ ముస్లిం అసోసియెషన్ సభ్యులు, కువైట్ ముస్లిం వెల్ఫేర్ అసోసియెషన్ సభ్యులు మరియు వందల మంది ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మోహన్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమములో ప్రముఖ సయెద్ అహ్మద్ ఉపన్యాసకుడుగా , ఇండియన్ ముస్లిం అసోసిఏషన్ ఉపాధ్యక్షుడు అంజాద్ ఖాన్ ముఖ్య అతిధిగా, ఫలాఏ మిలాత్ ముస్లిం వెల్ఫేర్ సొసయిటీ కార్యదర్సి మౌలానా రియాజ్ విశిష్ట అతిధిగా మరియు తెలుగు దేశం కువైట్ అదికార ప్రతినిది రహమతుల్ల, మైనారిటీ నాయకుడు షేక్ బాషాతో పాటు ప్రధాన కార్యదర్సి నాగేంద్ర బాబు, అధ్యక్షులు సుధాకర రావు వేదికనలంకరించారు. అంజాద్ ఖాన్ గారి ఖురాన్ పటనముతో మొదలయిన సభలో సయెద్ అహ్మద్ గారి ఉపన్యాసము అందరిని అలరించినది. అధ్యక్షులు సుధాకర రావు మట్లాడుతూ తెలుగు దేశం పార్టి ఇండియాలొను కువైట్ లోను ముస్లిం సొదరుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అధికార ప్రతినిది రహమతుల్లా గారు మాట్లాడుతూ తనకు గత పది సంవత్సరములుగా పార్టీతో వున్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు. నాగేంద్ర బాబుగారు కార్యక్రమానికి విచ్చెసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియ చేసారు. తెలుగు దేశం కువైట్ కార్యవర్గం అతిధులను ఘనంగా సన్మానించారు.







తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







