దుబాయ్‌లో 1.2 టన్నుల డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- February 11, 2025
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్ 1.2 టన్నుల సైకోయాక్టివ్ పదార్థాలను ఎయిర్ కార్గో సరుకులో అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. వీటిని ఎమిరేట్ ఎయిర్ పోర్ట్ గుండా వెళుతుండగా, ప్రత్యేక బృందాలు తాజా భద్రతా టెక్నాలజీలను ఉపయోగించి గుర్తించగలిగారు. ఎక్స్‌లోని సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. ఖచ్చితమైన డేటా విశ్లేషణ, షిప్‌మెంట్ వివరాల పరిశీలన ద్వారా డ్రగ్స్ ను గుర్తించారు.
దుబాయ్ కస్టమ్స్ బృందాలు షిప్‌మెంట్‌లోని నిషేధిత పదార్థాలను గుర్తించాయి. సంబంధిత అధికారులతో సమన్వయంతో చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. దుబాయ్ కస్టమ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్ట్స్, కస్టమ్స్, ఫ్రీ జోన్ కార్పొరేషన్ ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్.. పోర్ట్స్, కస్టమ్స్, ఫ్రీ జోన్ కార్పొరేషన్ చైర్మన్ సుల్తాన్ బిన్ సులేయం వెల్లడించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ తనిఖీ బృందాలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







