తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
- February 11, 2025
తిరుమల: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది.ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా,వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో..తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







