పేరెంట్స్ పై దురుసు ప్రవర్తన.. ప్రైవేట్ స్కూల్ పై కేసు నమోదు..!!
- February 11, 2025
మనామా: విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యా మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా.. పాఠశాల యాజమాన్యాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి ఒక నివేదిక సిద్ధం చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. స్కూల్ మేనేజ్ మెంట్ అనధికారిక పద్ధతుల్లో నిమగ్నమై, సంబంధిత నియంత్రణ సంస్థను సంప్రదించకుండా బహిష్కరణతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగారు. నిర్దేశిత నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఉండేలా విద్యా సంస్థలపై అవసరమైన పర్యవేక్షణను నిర్వహించాలని అధికారులకు మంత్రిత్వ శాఖ వెల్లించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సిబ్బంది హక్కులను రక్షించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







