కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- February 12, 2025
న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో ఆదాయపన్ను చట్టంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఇన్కమ్ టాక్స్ బిల్ 2025ను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు కింద సంక్లిష్టంగా ఉన్న పన్ను చట్టంలోని అంశాలను సరళీకృతం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పన్ను ఫైలింగ్ ప్రక్రియలో సమస్యలను తగ్గించి సులభతరం చేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లు, 536 క్లాజులు ఉన్నాయి.
ఈక్రమంలో అసెస్మెంట్ ఇయర్ పదాన్ని టాక్స్ ఇయర్ రీప్లేస్ చేయనుందని తెలుస్తోంది. అలాగే ప్రీవియస్ ఇయర్ పదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అనే పదంలో మార్పులు జరగనున్నాయని వెల్లడింది. పన్ను సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 12 నెలల కాలాన్ని సూచిస్తుంది. దీనిని ఆర్థిక సంవత్సరంతో అలైన్ చేయాలని నిర్ణయించబడింది. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లులో డిజిటల్ ట్రాన్సాక్షన్లు, క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచారం కూడా ఉండనుంది. అలాగే పన్ను చెల్లింపుదారుల రక్షణతో పాటు పారదర్శకతను పెంచేందుకు కీలక మార్పులు ఉండనున్నట్లు వెల్లడైంది. ప్రముఖ వార్తా సంస్థల నివేదిక ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించబడింది. జూలై 2024 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20 శాతానికి పెంచగా, లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
న్యూ టాక్స్ రీజిమ్ కింద మారిన శ్లాబ్ రేట్లు
- రూ.4 లక్షల వరకు – ఎలాంటి పన్ను ఉండదు
- రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను
- రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను
- రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను
- రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను
- రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను
- రూ.24 లక్షలకు పైగా ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది పాత పన్ను విధానం కింద ఉద్యోగులు రూ.50 వేల వరకు ఆదాయాన్ని స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మినహాయింపుగా పొందవచ్చు.ఈ క్రమంలో వారికి ఉన్ వాస్తవ వేతన ఆదాయం లేదా రూ.50 వేలు వీటిలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకునేందుకు పన్ను చట్టంలో వెసులుబాటు కల్పించబడింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







