ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025
- February 12, 2025
హైదరాబాద్: పదకొండవ సీజన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025* క్రికెట్ పోటీలలో భాగంగా ఈ నెల 14 & 15 తేదీల్లో ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న టీ20 మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సీసీఎల్ నిర్వాహకులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్టేడియం అధికారులు, జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, రిజర్వ్ పోలీసు వంటి వివిధ పోలీసు విభాగాలు నుండి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ..ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ ల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వివిధ భాషల సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు.రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న అన్ని రకాల క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు, ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో CCL ఫౌండర్ విష్ణు ఇందూరి, ఎస్బి డీసీపీ జి.నరసింహా రెడ్డి, ఎస్ఓటి డిసిపి రమణ రెడ్డి, ట్రాఫిక్ డిసిపి మల్లారెడ్డి, హెడ్ క్వార్టర్ డిసిపి శ్యాం, మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డిసిపి సిఎస్డబ్ల్యు ఏసిపి శ్రీనివాసరావు, మల్కాజ్గిరి ఏసిపి చక్ర చక్రపాణి, సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణు వర్ధన్ ఇందూరి మరియు బృంద సభ్యులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







