బహ్రెయిన్ విమానాశ్రయంలో భారీ స్టెయిన్డ్ గ్లాస్ మాస్టర్‌పీస్..!!
- February 13, 2025
మనామా: అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన కళాకారుడు సర్ బ్రియాన్ క్లార్క్ చేత "కాన్కోర్డియా" పేరుతో ఒక ప్రధాన స్టెయిన్డ్ గ్లాస్ ఆర్ట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. దీనిని ఈ వారంలో పనులు పూర్తవుతాయని తెలిపింది. ఎత్తు 17 మీటర్లు, వెడల్పు 34 మీటర్లు (578 చదరపు మీటర్లు) ఉండే ఇది, ఈ ప్రాంతంలో ఈ రకమైన అతిపెద్ద స్టెయిన్డ్-గ్లాస్ ఇన్‌స్టాలేషన్‌లలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొంది.
"బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్ బ్రియాన్ క్లార్క్ అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం మాకు గౌరవంగా ఉంది" అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ యూసిఫ్ అల్బిన్ఫాలా అన్నారు. ఈ ఇన్‌స్టాలేషన్ తమ టెర్మినల్ ఆకర్షణను మెరుగుపరచడమే కాకుండా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల వినూత్న అనుభవాన్ని ఇస్తుందన్నారు. విభిన్న సంస్కృతులకు కనెక్ట్ చేస్తుందని తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, చిత్రకారుడు, వాస్తుశిల్పి కళాకారుడు అయిన సర్ బ్రియాన్ క్లార్క్ "ఆధునిక స్టెయిన్డ్ గ్లాస్ పితామహుడు" అని గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







