రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి

- February 13, 2025 , by Maagulf
రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి

న్యూ ఢిల్లీ: ఈరోజు ఢిల్లీలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రోడ్ల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మరియు జనసేన పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాల శౌరి కలవడం జరిగింది.

నూతనంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్ట్ కి అనుసంధానంగా మచిలీపట్నం సౌత్ పోర్ట్ నుండి  నేషనల్ హై వే 65 కు కలుపుతూ 18.5 కి. మీ మేర 4 వరసల గ్రీన్ ఫీల్డ్ రోడ్ గా అభివృద్ధి పరచవలసి నదిగా కోరడమైనది. అలాగే మంగినపూడి బీచ్ నుండి పోర్ట్ వరకు సుమారు 12 కి. మీ మేర 4 వరసల రహదారిని అభివృద్ధి పరచవలసి నదిగా కోరడం జరిగింది.

అంతేకాకుండా పెడన గుడివాడ హనుమాన్ జంక్షన్ నూజివీడు లక్ష్మీపురం హై వే 216 H లో గుడివాడ మునిసిపల్ పరిధిలో 3.2 కి. మీ దూరం మేర రోడ్ ను నేషనల్ హై వే కి కలప వలసినదిగా ప్రత్యేకంగా కోరడం జరిగింది.  ఈ 216 H నేషనల్ హై వే కాకినాడ మరియు మచిలీపట్నం పోర్ట్ లకు ఎంతగానో ఉపయోగ పడుతుందని, భారతదేశం యొక్క ఆర్ధికాభివృద్ధి కి తోడ్పడే కృష్ణా గోదావరి బేసిన్ లోని సహజ వాయువుల నిక్షేపాలను వెలికి తీసే ONGC, GAIL, రిలయన్స్ పెట్రోలియం వంటి సంస్థల కార్యకలాపాలకు ఈ రోడ్ ఎంతో ఊతం ఇస్తుందని, ఇటువంటి ప్రధాన మైన రోడ్ గుడివాడనుండి వెళుతుందని, 3.2 కి. మీ మేర ఈరోడ్ ను 216 H కి లింక్ చేయవలసినదిగా కోరడం జరిగింది.

ఎంపీ స్వయంగా చెప్పిన విషయాలను అర్ధం చేసుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ విషయం లో వెంటనే తగు చర్యలు తీసుకునవలసినదిగా అధికారులను ఆదేశించడం జరిగింది.

సమస్యలపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రికి ఎంపీ గారు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com