ఇండియన్ స్కూల్ బౌషర్ లో ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు..!!

- February 14, 2025 , by Maagulf
ఇండియన్ స్కూల్ బౌషర్ లో ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు..!!

మస్కట్: ఇండియన్ స్కూల్ బౌషర్ 2025 అవుట్‌గోయింగ్ బ్యాచ్‌ ఫిబ్రవరి 8న గ్రాడ్యుయేషన్ వేడుకను జరుపుకుంది. పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మస్కట్ గవర్నరేట్ పవర్ మినిస్ట్రీలోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అబ్దులత్ అల్ రవాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ బౌషర్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్, ఒమన్‌లోని ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అకడమిక్ చైర్ పర్సన్ అశ్విని సావ్రికర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 'మెలోడీ ఆఫ్ బ్లెస్సింగ్స్'తో లాంఛనంగా ప్రారంభం కాగా, 'మార్చ్ ఆఫ్ ఎక్సలెన్స్' తో వేడుకలు ప్రారంభమయ్యాయి. దీని తర్వాత 'యూనిటీ ఇన్ హార్మొనీ' లో భాగంగా ఒమన్ - భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. 2025 అవుట్‌గోయింగ్ బ్యాచ్ వారికి మెమెంటోలు, సర్టిఫికేట్‌లను అందజేశారు. ‘గ్రేస్ ఇన్ మోషన్’ లో శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com