‘లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్’కు ఐడియాస్ అరేబియా ఇంటర్నేషనల్ అవార్డు..!!
- February 14, 2025
లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్ దుబాయ్ క్వాలిటీ గ్రూప్ (DQG) ప్రతిష్టాత్మక ఐడియాస్ అరేబియా ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది. అల్ హబ్తూర్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అండ్ గ్రూప్ చైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ చేతుల మీదుగా లెజెండ్ హోల్డింగ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కై జెంగ్, సహ వ్యవస్థాపకుడు, వైస్ ఛైర్మన్ మీరా వూ, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (ఆటోమోటివ్) చెన్నా రెడ్డి అవార్డును అందుకున్నారు.దుబాయ్ క్వాలిటీ గ్రూప్ (DQG) 17వ సైకిల్ ఆఫ్ దుబాయ్ క్వాలిటీ గ్రూప్ (DQG) అవార్డ్స్ విజేతలను ఘనంగా సత్కరించింది. ఫిబ్రవరి 5న అల్ హబ్తూర్ ప్యాలెస్ (దుబాయ్)లో దుబాయ్ క్వాలిటీ గ్రూప్ (DQG) ఒక గ్రాండ్ అవార్డు వేడుకను నిర్వహించింది. ఐడియాస్ అరేబియా ఇంటర్నేషనల్ అవార్డులో లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్ గ్రీన్ ఇనిషియేటివ్ కేటగిరీ కింద అవార్డును సాధించింది. "సస్టైనబుల్, ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ కార్ రెంటల్ సొల్యూషన్స్"ను అమలు చేసినందుకు అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కై జెంగ్ మాట్లాడుతూ.. హిస్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన వ్యాపార విధానం, తమ కార్యకలాపాలలో అంతర్భాగంగా ఉంటుందన్నారు. చెన్నా రెడ్డి మాట్లాడుతూ.. లెజెండ్ వరల్డ్ రెంట్ ఎ కార్ సుస్థిరమైన, వినూత్నమైన గ్రీన్ ఎనర్జీ వ్యాపార పరిష్కారాలను అవలంబించడానికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఇది స్థిరమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుందని, సమాజంలో సామాజిక ఆర్థిక మెరుగుదలలకు దారితీస్తుందని పేర్కొన్నారు. 1994 నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తున్నారు. ఐడియాస్ అరేబియా ఇంటర్నేషనల్ అవార్డ్ (గ్రీన్ ఇనిషియేటివ్ కేటగిరీ) పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడే విజయవంతమైన వినూత్న, స్థిరమైన, సమర్థవంతమైన ప్రాజెక్ట్‌లు/పద్ధతులను అమలు చేసే సంస్థలను గుర్తించి అవార్డులను అందజేస్తుంది.

తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







