ఫ్లయింగ్ ట్యాక్సీలు, కార్గో డ్రోన్‌ల కోసం ఎయిర్ కారిడార్లు..!!
- February 14, 2025
యూఏఈ: యూఏఈ తన ఎయిర్ కారిడార్‌ను మ్యాపింగ్ చేయడం ప్రారంభించింది. పైలట్, అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీలు, కార్గో డ్రోన్‌ల విస్తరణ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై కూడా పనిచేస్తోందని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) ప్రకటించింది. ఏరియల్ కారిడార్లు, నిబంధనలు రాబోయే 20 నెలల్లో వెల్లడిస్తామని GCAA తెలిపింది.
"పైలట్, స్వయంప్రతిపత్త ఎయిర్ టాక్సీలు, డ్రోన్‌ల కోసం ఎయిర్ కారిడార్ మ్యాపింగ్ ఒక కీలకమైన మైలురాయి. ఇది యూఏఈలో అధునాతన ఎయిర్ మొబిలిటీని అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది" అని జిసిఎఎ డైరెక్టర్ జనరల్ సైఫ్ మొహమ్మద్ అల్ సువైదీ అన్నారు.
వైమానిక మార్గాలు యూఏఈలోని కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఐకానిక్ ప్రదేశాలను కలుపుతాయని GCAA పేర్కొంది. 2026 మొదటి త్రైమాసికంలో ఈ సేవ ప్రారంభం కానుండడంతో, ఏరియల్ టాక్సీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి నగరంగా దుబాయ్ నిలుస్తుంది. జనవరి 9న, దుబాయ్ దేశంలోని మొట్టమొదటి వాణిజ్య వెర్టిపోర్ట్‌ను దుబాయ్ ఇంటర్నేషనల్ వెర్టిపోర్ట్ (DXV) అని నామకరణం చేశారు. ఈ వారం ప్రారంభంలో అల్ బతీన్, యాస్ ఐలాండ్, ఖలీఫా పోర్ట్‌తో సహా అబుదాబిలోని మూడు కీలక ప్రదేశాలలో వెర్టిపోర్ట్‌లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. వెర్టిపోర్ట్‌లు ఫ్లయింగ్ టాక్సీల టేకాఫ్, ల్యాండింగ్, సర్వీసింగ్ సేవలు అందించే వీటి నిర్మాణం 2026లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









