మోదీ, ట్రంప్ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు..
- February 14, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి అమెరికా చేరుకున్న మోదీ.. వాషింగ్టన్ లో దేశాధ్యక్షుడి అతిథిగృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు. అనంతరం వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై వారు చర్చించారు. వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చాయి. భారత్, అమెరికా దేశాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, రాబోయే నాలుగేళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు.
వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ ఒద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు. అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోదీ నిజంగా గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ అన్నారు. గతంకంటే రాబోయే నాలుగేళ్లు మేమిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ అన్నారు. రెండు దేశాలు కలిసికట్టుగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ భేటీలో ఇండియా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్, మోదీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై వివరాలు వెల్లడించారు. రెండు దేశాల మధ్య అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టిపెడతామని, 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం అని తెలిపారు.
సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచిఉన్న వేళ భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా ట్రంప్, మోదీ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని, అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







