సినిమా రివ్యూ: ‘లైలా’.!
- February 14, 2025
సినిమా హిట్టా.. ఫట్టా అనే సంబంధం లేకుండా యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొన్నీ మధ్యనే ‘మెకానిక్ రాఖీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విజయం ఏంటనేది ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు కానీ, లేటెస్ట్ మూవీ ‘లైలా’ ముచ్చట ఎలా వుందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
సోను మోడల్ (విశ్వక్ సేన్) పాత బస్తీలో ఓ బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. తల్లి జ్హాపకార్ధంగా పెట్టుకున్న ఈ బ్యూటీ పార్లర్‌లో మహిళలను తన టాలెంట్‌తో అందంగా మేకప్ చేస్తూ వారి మనసులు గెలుచుకుంటాడు. కేవలం మేకప్ చేయడమే కాదు, వారి వారి కుటుంబాల్లోని కష్టనష్టాలను తెలుసుకుంటూ వారికి సాయం చేస్తుంటాడు కూడా. అలా ఓ మహిళకు సాయం చేసే క్రమంలోనే సోను చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కుల్నించి కాపాడుకోవడానికే లేడీ (లైలా) అవతారమెత్తుతాడు. మరి, సోనుకి ఆ సమస్యల్లో ఇరికించిందెవరు.? వాటి నుంచి లైలా గెటప్‌ని అడ్డం పెట్టుకుని సోను ఎలా బయటపడ్డాడు.? అసలు రుస్తుం (అబిమన్యుసింగ్)కీ సోనూకీ సంబంధం ఏంటీ.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘లైలా’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
విశ్వక్ సేన్ ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా బాగానే కస్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో నటించి బాగానే మెప్పించాడు. గతంలోనూ చాలా మంది సీనియర్ హీరోలు లేడీ గెటప్స్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే విశ్వక్ సేన్ కూడా తన వంతుగా కష్టపడ్డాడు. ఇక, హీరోయిన్ ఆకాంక్ష శర్మకు అందాల ప్రదర్శన తప్ప పెద్దగా స్కోపున్న పాత్ర దక్కలేదు. రుస్తుంగా మరో కీలక పాత్రలో కనిపించిన అభిమన్యు సింగ్ ఆకట్టుకుంటాడు. ఇంతవరకూ చేసిన పాత్రల్లో ో ఓ డిఫరెంట్ రోల్ దక్కింది అభిమన్యుసింగ్‌కి. వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్వులతో ఆకట్టుెకుంటాడు. యూ ట్యూబర్ సునిశిత్ తన రియల్ క్యారెక్టర్‌నే ీ సినిమాలోనూ పోసించాడు. కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్‌లో కనిపించింది. పృద్వీ, ప్రభావతి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు రామ్ నారాయణ్ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా.. కథనాన్ని ఇంకాస్త లాజికల్‌గా నడిపించి వుంటే బాగుండేది. మదర్ సెంటిమెంట్ అయినా గట్టిగా పట్టుకుని వుండాల్సింది. అడల్డ్ డైలాగులూ, డబుల్ మీనింగ్ సంభాషణలతో జబర్దస్త్ కామెడీ చేసేశాడు. జేమ్స్ లియోన్ నేపథ్య సంగీతం ఓకే.. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌కి ఇంకాస్త పదును అవసరమే. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
లైలా పాత్రలో విశ్వక్ సేన్ హావ భావాలు ఆకట్టుకుంటాయ్. అక్కడక్కడా కొంత కామెడీ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథ, కథణం,రొటీన్ రొట్ట కొట్టుడు కామెడీ సన్నివేశాలు, సెంటిమెంటే పండడని ఎమోషనల్ సీన్లు వగైరా.. వగైరా..
చివరిగా:
‘లైలా’ కామెడీ అంటే అడల్డ్ డైలాగులేనా.? అనిపించేలా.!
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







