భారతీయ పౌరులకు యూఏఈ గుడ్ న్యూస్..వీసా ఆన్ అరైవల్ విస్తరణ..!!

- February 15, 2025 , by Maagulf
భారతీయ పౌరులకు యూఏఈ గుడ్ న్యూస్..వీసా ఆన్ అరైవల్ విస్తరణ..!!

అబుదాబి: భారతీయ పౌరులు కోసం తన వీసా ఆన్ - అరైవల్ కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరింత విస్తరించింది.ఆరు కొత్త దేశాల నుండి చెల్లుబాటు అయ్యే వీసాలు, నివాస అనుమతులు లేదా గ్రీన్ కార్డులు ఉన్న వారికి ఆన్-అరైవల్ వీసా ఇవ్వనుంది. ఫిబ్రవరి 13 నుండి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం.. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల నుండి సాధారణ పాస్పోర్ట్లు, చెల్లుబాటు అయ్యే వీసాలు, నివాస అనుమతులు లేదా గ్రీన్ కార్డులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు యూఏఈలో అడుగు పెట్టగానే వీసాలు మంజూరు చేస్తారు. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్న యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాలకు ఇవి అదనం. ఈ మేరకు యూఏఈ-భారతదేశం మధ్య బలమైన సంబంధాన్ని హైలైట్ చేస్తూ, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్స్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్, సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చొరవ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యవస్థాపకులను ఆకర్షించడం, ప్రముఖ ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. కాగా దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే ఆరు నెలల పాస్పోర్ట్ చెల్లుబాటు, నిర్దేశించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com