42 మిలియన్ రెడ్ రోజెస్ రవాణా చేసిన ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో..!!

- February 15, 2025 , by Maagulf
42 మిలియన్ రెడ్ రోజెస్ రవాణా చేసిన ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో..!!

దోహా: ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్ కార్గో క్యారియర్ అయిన ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో 2,800 టన్నుల పూలను రవాణా చేసింది. ఈ సీజన్‌లో కెన్యా, దక్షిణ అమెరికా నుండి 42 మిలియన్ల తాజా రెడ్ రోజెస్ కు ఇది సమానం. నైరోబీ నుండి, క్యారియర్ దాదాపు 1,600 టన్నుల ఎర్ర గులాబీలను దాని షెడ్యూల్ చేసిన విమానాలు, చార్టర్‌లలో రవాణా చేసింది. దాంతోపాటు బొగోటా , క్విటో నుండి ఇది దాదాపు 1,200 టన్నులను ఆమ్‌స్టర్‌డామ్, మధ్యప్రాచ్యం, ఆసియా,  ఆస్ట్రేలియాతో సహా కీలక మార్కెట్‌లకు తరలిచింది. రెగ్యులర్ షెడ్యూల్డ్ ప్యాసింజర్, కార్గో విమానాలకు అదనంగా కార్గో క్యారియర్ నైరోబీ నుండి తొమ్మిది (9) అదనపు బోయింగ్ 777 చార్టర్‌లను.. క్విటో నుండి పది (10) అదనపు చార్టర్‌లను గత వారం రోజుల్లో పెరిగిన డిమాండ్‌కు మద్దతుగా నిర్వహించిందని ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో చీఫ్ ఆఫీసర్ కార్గో  మార్క్ డ్రూష్ తెలిపారు. సాధారణంగా ఫిబ్రవరి నెల ఫ్లోరికల్చర్ రంగానికి ముఖ్యమైన ఆర్థిక నెల అని,  ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో సేవలు ఈ అగ్రిబిజినెస్ విజయానికి తనవంతు సాయం అందజేస్తుందని తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com