రియాద్ మెట్రో రికార్డులు.. 75 రోజుల్లో 18 మిలియన్ల ప్రయాణికులు..!!
- February 15, 2025
రియాద్: రియాద్ మెట్రో డిసెంబర్ 1, 2024న ప్రారంభించారు. 75 రోజుల్లో 18 మిలియన్ల మంది ప్రయాణికులతో కొత్త రికార్డులను నమోదు చేసిందని, 162,000 ట్రిప్పులను పూర్తి చేసి, దాని ఆరు మెట్రో లైన్లలో 4.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించిందని రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) ప్రకటించింది. బ్లూ లైన్ (అల్ ఒలాయా-అల్ బాతా కారిడార్) అత్యంత రద్దీగా ఉండే మార్గం అని, 10 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారనితెలిపింది. కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టేషన్ అత్యధికంగా ప్రయాణించిన స్టేషన్ గా నిలిచిందని, 3 మిలియన్లకు పైగా ప్రయాణికులు దాని గుండా వెళుతున్నారని పేర్కొంది. మెట్రో నెట్వర్క్ దశలవారీ ప్రారంభం డిసెంబర్ 1, 2024న బ్లూ లైన్ (లైన్ 1), ఎల్లో లైన్ (లైన్ 4), పర్పుల్ లైన్ (లైన్ 6) ప్రారంభంతో ప్రారంభమైంది. దీని తర్వాత డిసెంబర్ 15న రెడ్ లైన్ (లైన్ 2), గ్రీన్ లైన్ (లైన్ 5) వచ్చాయి, జనవరి 5న అందుబాటులోకి వచ్చింది.
రియాద్ మెట్రో ..మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవర్‌లెస్ రైలు వ్యవస్థ. ఇప్పుడు 176 కిలోమీటర్లు విస్తరించి 85 స్టేషన్లకు సేవలు అందిస్తోంది. వీటిలో నాలుగు ప్రధాన హబ్‌లు ఉన్నాయి. ప్రయాణీకులు డార్బ్ యాప్ ద్వారా, టికెట్ ఆఫీసులలో, మెట్రో స్టేషన్లలోని స్వీయ-సేవా కియోస్క్‌లలో లేదా బ్యాంక్ కార్డులు, క్రెడిట్ కార్డులు, స్మార్ట్ పరికరాలతో సహా డిజిటల్ చెల్లింపు పద్ధతుల ద్వారా టిక్కెట్లను బుక్ తోపాటు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. రియాద్ మెట్రో నగర ప్రజా రవాణా విస్తరణకు కీలకంగా మారింది. సౌదీ విజన్ 2030కి అనుగుణంగా స్థిరమైన పట్టణ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అనుగుణంగా రూపొందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







