లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి వాహనం దహనం..ఖండించిన యూఏఈ..!!
- February 16, 2025
యూఏఈ: బీరుట్ విమానాశ్రయం సమీపంలో ఐక్యరాజ్యసమితి తాత్కాలిక దళం (UNIFIL) వాహనాన్ని దహనం చేయడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ ఘటనలో అంతర్జాతీయ దళం సభ్యుడికి గాయాలు అయ్యాయి. రాజకీయ వ్యవహారాల విదేశాంగ సహాయ మంత్రి లానా జాకీ నుస్సీబెహ్.. అంతర్జాతీయ దళాలపై దాడిని యూఏఈ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతి పరిరక్షక దళాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్ట సూత్రాలను, యూఎన్ భద్రతా మండలి తీర్మానం నంబర్ 1701 నిబంధనలను ఉల్లంఘించడమేనని గుర్తుచేశారు. లెబనాన్, దాని సార్వభౌమాధికారం , ప్రాదేశిక సమగ్రతకు యూఏఈ మద్దతును ఇస్తుందన్నారు.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







