కార్లు ఢీ.. ట్రాఫిక్‌ను అడ్డుకోవద్దని యూఏఈ పోలీసులు హెచ్చరిక..!!
- February 15, 2025
యూఏఈ: యూఏఈలో వాహనదారులు చిన్న ప్రమాదానికి గురైతే రోడ్డు పక్కనకు వెళ్లాలని పోలీసులు కోరారు. అబుదాబి పోలీసులు శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ఈ మేరకు తెలిపారు. చిన్న ప్రమాదానికి గురైన వాహనాలను సమీపంలోని సురక్షిత పార్కింగ్ స్థలానికి తరలించాలని అందులో కోరారు. అథారిటీ షేర్ చేసిన వీడియోలో..మొదటి చిన్న కారు ప్రమాదం తర్వాత అనేక కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఢీకొన్న తర్వాత వాహనాలు రోడ్డుపై ఆగిపోవడంతో, ఎదురుగా వచ్చే వాహనాలు సకాలంలో ఆపలేకపోవడం లేదా రోడ్డు నుండి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.
చిన్న ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో పోలీసులు సూచనలను అందించారు.
ముందుగా, కారును సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. ఆ తర్వాత సయీద్ యాప్‌ని ఉపయోగించి ప్రమాద సంఘటనను 800 72233 కు కాల్ చేసి నివేదించవచ్చు. చిన్న ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపైనే ఉండటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఇది ఆర్టికల్ 98 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఉల్లంఘించిన వ్యక్తిపై దిర్హామ్‌లు 500 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







