మోసకారి నక్క

- July 10, 2015 , by Maagulf
మోసకారి నక్క

పూర్వం మగథ రాజ్యంలో ఒక వనం ఉండేది. ఆ వనంలో ఒక కాకి, లేడి స్నేహంగా ఉండేవి. ఒకరోజు వాటి మధ్యలోకి ఒక నక్క వచ్చింది. అది కూడా వాటితో స్నేహం చేస్తానని నమ్మబలికింది. కానీ కాకి అందుకు ఒప్పుకోలేదు. నువ్వు జిత్తులమారివి. నువ్వు మాకేదో హాని తలపెట్టి మాతో స్నేహం చేయదలచావు కనుకు వద్దు అని లేడితో చెప్పింది. కానీ లేడి నక్కతో స్నేహం చేయడానికి సిద్దంగా ఉందని నక్కకు అర్ధమయ్యింది. అందుకే లేడితో కాకి కొత్తవారిని నమ్మరాదు వద్దు వద్దు అని వారించింది. అందుకు ఆ నక్క ఈ లేడి నీతో స్నే హం చేసేటప్పటికీ నువ్వు కూడా కొత్తవాడివే కదా. నేను మంచివాడినే నేను ఇప్పుడు అస్సలు మాంసాహారమే భుజించట్లేదు. లేడివలే ఆకులు అలమలు తింటున్నాను. నా వల్ల మీకు ఏం భయం లేదు అని చెప్పింది. దాంతో అవి ఒప్పుకుని స్నేహం చేయసాగాయి. ఒకరోజు కాకి లేని టైంలో లేడితో నక్క 'లేడి బావా ఈ వనానికి అవతలి వైపు ఏపుగా పెరిగిన పైరును చూశాను. అది నీకు, నాకూ కూడా మంచి ఆహారం పద వెళ్లి కడుపు నిండా తినేసి వద్దాం అని తీసుకెళ్లింది. అది చూసిన లేడి ఎంతో సరడాగా ఆ పైరును భుజించి, ప్రతిరోజూ అక్కడికి నక్కతో పాటు వచ్చి పోతుండేది. ప్రతిరోజూ తన పైరు తగ్గిపోతుండడం చూసి ఆ పొలం యజమాని ఇక వల పన్నాడు. ఈ సంగతి తెలిసిన నక్క ఆ రోజూ లేడితో పాటు పొలంలోకి పోకుండా లేడి పొలంలో గడ్డి మేస్తుండగా నక్క పొద చాటున పొంచి ఎప్పుడెప్పుడు ఆ యజమాని లేడిని పట్టి చంపి పడేస్తాడా, అప్పుడు లేడి మాంసంతో దాని కడుపు నింపుకుందామా అని ఎదురు చూడసాగింది. ఇంతలో రైతు పన్నిన వలలో లేడి చిక్కుకుని నక్కని పిలిచి ఆ వల కొరికి కాపాడమని అరిచింది. నక్క అందుకు జిత్తులమారి ఆలోచనతో లేడి బావా నేను మాంసం ముట్టను కదా. ఈ వల నరములతో చేసింది. నేను కొరకను అని చెప్పింది. ఇంతలో కాకి లేడిని వెతుక్కుంటూ వచ్చి నక్క ఏదని అడిగింది. జరిగిన విషయం తెలుసుకుని లేడి వలని కొరికేసి లేడికి ఒక ఉపాయం చెప్పింది. దాంతో ఆ రైతు వచ్చి లేడిని చూసి పిచ్చి కోపంతో చంపేద్దామనుకుని ఒక గునపాన్ని విసిరాడు. అప్పటికే వల తెగి ఉన్నలేడి పక్కకు తప్పుకోవడంతో ఆ గునపం నక్కకు తగిలి అక్కడికక్కడే చనిపోయింది.
నీతి - కపటంగా ఆలోచించినందుకు తన చావు తానే కోరి తెచ్చుకుంది నక్క.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com