దుబాయ్ లో రోజూ వందలాది సైకిళ్లు, ఈ-స్కూటర్లు సీజ్..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలోని వ్యాపారాలు సైకిళ్లు, ఇ-స్కూటర్లను ఉపయోగించడంపై మార్గదర్శకాలను కోరుతున్నారు. ఎందుకంటే అధికారులు రోజు వందల సంఖ్యలో వాటిని సీజ్ చేతున్నారు. సెప్టెంబరులో దుబాయ్ పోలీసులు నైఫ్‌లో దాదాపు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లను ఉల్లంఘనల కింద జప్తు చేసినట్లు చెప్పారు. రోడ్లు, పాదచారుల లేన్ల వంటి ప్రాంతాలలో ఉపయోగించడం నేరమని తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో దుబాయ్ అంతటా ఈ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఈ-స్కూటర్లు, సైకిల్ రైడర్లు అనుసరించాల్సిన నియమాలను అధికారులు గతంలో హైలైట్ చేశారు. లైసెన్సింగ్ అథారిటీ నిర్దేశించిన నిర్ణీత లేన్లలో ప్రయాణించడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్లను నివారించడం, బ్యాలెన్స్‌ను ప్రభావితం చేసే ప్రయాణీకులు లేదా వస్తువులను తీసుకెళ్లకపోవడం, ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా రైడింగ్ చేయకపోవడం, పాదచారుల క్రాసింగ్‌ల వద్ద దిగడం మరియు సేఫ్టీ గేర్ ధరించడం వంటివి ఉన్నాయి. పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడం , నిర్లక్ష్యపు రైడింగ్ వంటి పెనాల్టీలకు 300 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







