జాతీయ వేడుకలకు అంతర్గత మంత్రిత్వ శాఖ సిద్ధం..నో ఫైర్ వర్క్స్ ప్లీజ్..!!
- February 19, 2025
కువైట్: రాబోయే జాతీయ వేడుకలకు అంతర్గత మంత్రిత్వ శాఖ, అగ్నిమాపక దళం అధికారులు సిద్ధంగా ఉన్నారు. వేడుకలకు సన్నాహకంగా అన్ని గవర్నరేట్‌లలో 23 స్థిర భద్రతా తనిఖీ కేంద్రాలు వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్‌లోని ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ అల్-ఉస్తాద్ మూడు ప్రాథమిక భద్రతా తనిఖీ కేంద్రాలను(గల్ఫ్ స్ట్రీట్ వెంబడి సైంటిఫిక్ సెంటర్ ఎదురుగా, బ్నీద్ అల్-గర్, జులాయా) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీలను ఎదుర్కోవడానికి చెక్‌పోస్టులు పూర్తిగా సన్నద్ధమై ఉన్నాయని, అవసరమైన మేరకు సహాయం చేసేందుకు కువైట్ ఫైర్ ఫోర్స్, కువైట్ మునిసిపాలిటీకి చెందిన సిబ్బంది రెడీగా ఉన్నారని తెలిపారు. అగ్నిప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేడుక స్థలాలకు చేరుకోవడం సవాలేనని అన్నారు. ఫైర్ వర్క్స్ వాడవద్దని, అవి ప్రమాదాలను పెంచుతాయని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







