రమదాన్ తనిఖీలలో 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు
- July 10, 2015
రమదాన్ పండుగను పురస్కరించుకుని అబుధాబీ మరియు అల్ ఆయీన్ లలో ఏర్పాటు చేసిన 24 రమదాన్ టెంట్లు మరియు 59 ప్రమోషనల్ కియోస్క్‌లలో అబుధాబీ ఫుడ్ అండ్ కంట్రోల్ అథారిటీ వారి హోటెల్ అండ్ ఇవెంట్స్ కంట్రోల్ యూనిట్ వారు ఆహారపదార్ధాల తయారీ, వండడం, ప్రదర్శించడం వంటి అంశాలలో సాధారణంగా జరిగే నిబంధనల ఆతిక్రమణ లక్ష్యంగా రెండు వారాల పాటు తనిఖీలు జరిపి, 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా కమ్మూనికేషన్ అండ్ కమ్మ్యూనిటీ సర్వీస్ డివిజన్ డైరక్టర్ జనరల్ - మొహమ్మద్ జలాల్ అల్ రైసీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్న వీటి సంఖ్యను గమనించినట్లైతే, తాము సరైన దిశలోనే ఉన్నామని తెలుస్తోందని, వినియోగదారులను తాము భాగస్తులుగా భావిస్తామని, ఈ ప్రదేశాలలో ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినట్లైతే తమకు తెలియజేయవలసినదని, ఇందుకు గాను 800555 నెంబరుకు ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కేవలం రమదాన్ నెలలో మాత్రమే కాకుండా, తనిఖీలు సంవత్సరమంతా కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







