ప్రయాణంలో వాంతులు-వికారంకు చెక్ పెట్టడం ఎలా?
- July 10, 2015
కొంతమంది ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోతుంటారు . ఎందుకంటే ప్రయాణంలో వికారంగాను, వాంతులు మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీన్ని మోషన్ సిక్ నెస్ అని పిలుస్తుంటారు. కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. బస్సులో, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. కొందరికి షిప్లలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. వికారం, వాంతులు & నీరసం తగ్గించే10 బెస్ట్ ఫుడ్స్ కాబట్టి, మీరు ఎక్కడైకనా ప్రయాణం చేయాలనుకొన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హాపీగా జరగుతుంది. ఈ మోషన్ సిక్ నెస్ ఉన్నప్పుడు వాంతలు, బలహీనత, డీహైడ్రేషన్ మరియు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం జరుగుతుంది. ఇలా కంటిన్యూగా జరిగితే తీవ్ర డీహైడ్రేషన్ కు గురి కావాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో వికారం-వాంతులను తగ్గించే ఆహారాలు అందువల్ల ప్రయాణం చేయదల్చుకొనే వారు. ముఖ్యంగా మోషన్ సిక్నెస్ ఉండే వారు ప్రయాణానికి ముందు వికారం మరియు వాంతులను నివారించడానికి కొన్ని మాత్రలను తీసుకుంటుంటారు . ఈ మెడిసిన్స్ మరింత క్రుంగదీయవచ్చు. అలాంటి మందులు తీసుకొన్నప్పుడు, ప్రయాణంలోవ్యక్తి ఉత్సాహంగా ఉండలేరు . కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని హో రెమెడీస్ ఉన్నాయి. వీటిని ప్రయాణానికి ముందు తీసుకొన్నట్లైతే మీరు వాంతులు మరియు వికారాలు, తలతిరగడం వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు . మరి ఆ హోం రెమెడీస్ ఎంటో ఒకసారి చూద్దాం... అల్లం చాలా బాగా తెలిసిన యాంటిమెటిక్ మెడిసిన్ . ఇది వాంతులను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఎందుకంటే వీటిలో ఎసిడిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది . కాబట్టి, ప్రయాణానికి ముందు జింజర్ టీ లేదా అల్లంతో తయారుచేసి ఆహారాలను తీసుకుంటే, వాంతులు, వికారం తగ్గించుకోవచ్చు . ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ప్రయాణానికి ముందు ఈ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గించుకోవచ్చు. మింట్ టీ కూడా వాంతులను తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగించి ప్రయాణానికి ముందు తీసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని చేతులు పెట్టుకొని వాసన చూడటం లేదా నమలటం చేయాలి . పుదీనా ఆకు నుండి వచ్చే సువాసన కూడా వాంతులు మరియు వికారం తగ్గిస్తాయి. యాంటీ ఎమిటిక్ లక్షణాలు దాల్చిన చెక్కలో కూడా పుష్కలంగా ఉన్నాయి . కొద్దిగా దాల్చిన చెక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి . ఆ నీటిని గోరువెచ్చగా తీసుకోవడం వల్ల వాంతులు వికారం తొలగిపోతుంది. ముఖ్యంగా గర్భిని స్త్రీలకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రైస్ వాటర్ (గంజి)చిక్కగా ఉండే బియ్యం గంజిలో న్యూట్రీలైట్స్ ఎక్కువగా ఉండి స్టొమక్ యాసిడ్స్ మీద ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. దాంతో వాంతుల మరియు వికారం తగ్గిస్తుంది. వైట్ రైస్ ను నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి తర్వాత ఆ నీటిని వంపే కొద్దిగా ఉప్పు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇది వాంతుల నుండి తక్షణ ప్రభావం చూపుతుంది. వాంతులను నివారిస్తుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ చేసి, రసం తీసి, అందులో పుదీనా రసాన్ని కూడా మిక్స్ చేయవచ్చు . ఈ కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది . దాంతో వాంతులు మరియు వికారం తగ్గించుకోవచ్చు. ప్రయాణంలో వాంతులు మరియు వికారం తగ్గించుకోవడానికి కొన్ని లవంగాలను నోట్లో వేసుకొని నమలాలి . రుచికరంగా ఉండటం కోసం కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే మంచి జీర్ణశక్తి కూడా... ప్రయాణంలో తరచూ యాలకలను నోట్లో వేసుకొని నమలడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గిస్తుంది . ఇది వాంతులను తగ్గించి , వికారం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . అలాగే మీరు యాలకలు, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీని తీసుకోవచ్చు. పెప్పర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసిన వాటర్ త్రాగడం వల్ల తలనొప్పి, మరియు తలతిరగడం వంటి లక్షణాల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో త్రాగితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . వాంతులు వికారం నుండి విముక్తిపొందవచ్చు. ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా జీలకర్ర పొడి మిక్స్ చేసి ప్రయాణానికి బయలు దేరే ముందు త్రాగాలి. ఇది వాంతులు మరియు వికారం నుండి తక్షణ ప్రభావం చూపుతుంది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







