ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ

- February 19, 2025 , by Maagulf
ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ

హైదరాబాద్: కథలు నిజ జీవితం ప్రతి బింబాలే నని నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ లేఖిని రచయిత్రులు వేదిక ఆధ్వర్యంలో కస్తూరి అలివేణి రచించిన ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ,వంశీ రామరాజు డాక్టర్ సుధా రామరాజు కు అంకిత మహోత్సవం సభ జరిగింది.ముఖ్యఅతిథిగా బైస దేవదాసు సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ... వాస్తవిక వున్న కథలు కాల పరీక్షకు నిలబడతాయి అని అలువేణి చెప్పిన కధలు సమాజంలో జరిగే సంఘటనలను అద్దంలో చూపాయి అని ఉదహరించారు అంకితం తీసుకున్న వంశీ దంపతులు సాంస్కృతిక సాహిత్య రంగాలకు రెండు కాళ్ళు అని అభివర్ణించారు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ...సులభమైన పదాలతో ఎట్టి అతిశయోక్తులు లేకుండా చెప్పే నేర్పు అలివెని సొంతం అన్నారు.ఇంటిపేరు కస్తూరి లోనే సుగంధం నింపుకున్న ఆమె కథలు సువాసన భరితం అన్నారు. సంపుటి ఆవిష్కరణ చేసిన దేవ దాసు నేటి నిజం పత్రికతో చేస్తున్న సాహితీ సేవ అకింతం అందుకున్న వంశీ రామరాజు దంపతుల సాంస్కృతిక సేవ విశేష మని కొనియాడారు రచయిత్రి శైలజ మిత్ర సంపుటి లోని కధలను పరిచయం చేశారు. లేఖిని సంస్థ అధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మి స్వాగతం పలుకుతూ సంస్థల కార్యక్రమాలు పరిచయం చేశారు తొలుత ప్రముఖ గాయకుడు వై ఎస్ రామ కృష్ణ బృందం దర్శకుడు విశ్వనాథ్ సినిమాలలోని పాటలు మధురం గా ఆలపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com