సిరివెన్నెలకి అంకితంగా.. అమెరికాలో సాంగ్ తెరకెక్కించిన డైరెక్టర్..
- February 20, 2025
అమెరికా: మనసంతా నువ్వే, నేనున్నాను.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ డా.వి.ఎన్.ఆదిత్య ఇటీవల ‘స్వప్నాల నావ’ అనే ఓ ప్రైవేట్ సాంగ్ తెరకెక్కించారు. డల్లాస్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, తెలుగువాడు గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ ‘స్వప్నాల నావ’ మ్యూజిక్ వీడియోని నిర్మించారు. గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా ఇందులో నటించింది.
ఈ ‘స్వప్నాల నావ’ చదువులో ఫెయిలయిన విద్యార్థినీ విద్యార్థులను మోటివేట్ చేసే పాట ఇది.దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాటను తెరకెక్కించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఆలూరు ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
‘స్వప్నాల నావ’ తో సిరివెన్నెల గారి గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు ఈ టీమ్. ఇటీవల శ్రీ క్రియేటివ్స్ USA యూట్యూబ్ ఛానల్ లో రిలీజైన ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ గర్వించదగ్గ దిగ్గజ రైటర్ కమ్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కి డా.VN ఆదిత్య గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాటని ఓఎమ్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా నిర్మించారు.ఈ సాంగ్ ని పూర్తిగా అమెరికాలోని డల్లాస్ లోనే షూట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







