ఆందోళనకరంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం..
- February 20, 2025
వాటికన్: క్యాధలిక్ చర్చి హెడ్ పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊపిరితిత్తుల్లో న్యుమోనియా సమస్యతో పోప్ పోరాటం చేస్తున్నారు. శ్వాసకోశ సంబంధ పాలీ మైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు పోప్. ఆయన రెండు ఊపిరితిత్తులకు న్యుమోనియా సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు.
కాగా, న్యుమోనియాతో పోరాటంలో తాను గెలవలేనని తన సహాయకులతో పోప్ చెప్పినట్లు తెలుస్తోంది. న్యుమోనియా నుండి తానిక కోలుకోలేనని, ఎక్కువ కాలం బతకనని పోప్ తన సహాయకులతో చెప్పారట. ఈ మేరకు పోప్ వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాట.
గత శుక్రవారం రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు డాక్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు. పోప్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోప్ అనారోగ్యం నుండి కోలుకోవడం కష్టమే అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు డాక్టర్లు. న్యుమోనియాతో పాటు ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ తో పోప్ బాధపడుతున్నారని.. ఆయనకు యాంటీ బయోటిక్ చికిత్స కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు.
2013లో కాథలిక్ చర్చి హెడ్ గా ఉన్న పోప్ ఫ్రాన్సిస్.. ప్రార్థనల సమయంలో బైబిల్ చదివేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక 2021 లో హెర్నియా, పెద్ద పేగు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మోకాలి నొప్పి కారణంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. 21 ఏళ్ల వయసులోనే ఓ వ్యాధి కారణంగా పోప్ దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు ఆయన కుడి ఊపిరితిత్తులో కొంత భాగాన్ని కట్ చేసి వైద్యం చేసి బతికించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







