రెస్టారెంట్ ఎక్విప్‌మెంట్ సేల్..సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసిన కోర్టు..!!
- February 21, 2025
మనామా: రెస్టారెంట్ పరికరాల అమ్మకం ద్వారా వచ్చిన నగదును జేబులో వేసుకున్నాడని ఓ వ్యక్తిపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది.డిఫెన్స్ లాయర్ హుదా అల్ అస్వాద్ మాట్లాడుతూ.. మైనర్ క్రిమినల్ కోర్ట్ తన క్లయింట్ నిర్దోషి అని,అతను రెస్టారెంట్‌కు చెందిన నగదు, వస్తువులను రెండింటినీ దుర్వినియోగం చేశాడని ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించిందని తెలిపాడు.రెస్టారెటంట్ వస్తువులను ఎప్పుడూ స్వాధీనం చేసుకున్నట్లు ఎటువంటి రుజువు లేదని వాదించాడు, వాటిని విక్రయించడం మాత్రమే తన క్లయిండ్ కు అప్పగించారని వివరించాడు. 10 శాతం కమీషన్ తీసుకొని తన క్లయింట్ మిగతా మొత్తాన్ని రెస్టారెంట్ ఓనర్ క సమర్పించాడని తెలిపారు. తానే వ్యాపార భాగస్వామిగా ఉన్న మరొక వ్యక్తికి విక్రయించడానికి పరికరాలను ఇచ్చానని ఫిర్యాదుదారు స్వయంగా ముందస్తు ప్రకటనలో అంగీకరించారని లాయర్ గుర్తుచేశారు. తన క్లయింట్ రెస్టారెంట్‌లో పనిచేయడం ప్రారంభించకముందే ఈ ఏర్పాటు జరిగిందని తెలిపారు.
వ్యాపార భాగస్వామి మాటను సాక్ష్యంగా పేర్కొంటూ నిందితుడు వస్తువులను విక్రయించి డబ్బును తన స్వంతం కోసం తీసుకున్నాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కానీ కోర్టులో, అతను మొదట్లో తన వ్యాపార భాగస్వామికి అమ్మకం కోసం రెస్టారెంట్ పరికరాలను అందజేసినట్లు ధృవీకరించాడు.అలాగే కోర్టులో వస్తువలు అమ్మిన డబ్బును స్వీకరించినట్లు అంగీకరించాడు. కాగా, పరికరాలను అప్పగించిన దానికంటే ఎక్కువకు విక్రయించినట్లు ఆధారాలు లేవని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.నిందితుడు ఏదైనా తప్పు చేశాడని ఎటువంటి దృఢమైన రుజువు లేకపోవడంతో, కోర్టు అభియోగాన్ని కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలోని ఆర్టికల్ 255 ప్రకారం అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







