హీరా పార్క్, వాక్‌వే ప్రారంభించిన జెడ్డా గవర్నర్..!!

- February 21, 2025 , by Maagulf
హీరా పార్క్, వాక్‌వే ప్రారంభించిన జెడ్డా గవర్నర్..!!

జెడ్డా: హీరా పార్క్, వాక్‌వే లతోపాటు అల్-షాతియా జిల్లాలో రెండు పార్కులను జెడ్డా గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా ప్రారంభించారు. జెడ్డా గవర్నరేట్ మేయర్ సలేహ్ అల్-తర్కీ, పలువురు మేయర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హీరా పార్క్,వాక్‌వే 70వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.నగరంలో వృక్షసంపదకు మద్దతుగా 26వేల చదరపు మీటర్ల వ్యవసాయ నర్సరీకి అనుసంధానం చేశారు.పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మెరుగుపరచడంలో కింగ్‌డమ్ విజన్ 2030  లక్ష్యాలకు అనుగుణంగా వీటిని నిర్మించారు. 4,770 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈవెంట్‌లు, పిల్లల ఆటలు, క్రీడా కార్యకలాపాల కోసం కేటాయించారు. 1,227 మీటర్ల పొడవైన వాక్ వే మార్గం ప్రాజెక్ట్‌లో కీలకమైన భాగం. ఈ ప్రాజెక్ట్ కోసం 24,550 చెట్లు, పొదలను వినియోగించారు. సైట్‌లో 91 సీటింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 

షాటే డిస్ట్రిక్ట్ 1 అండ్ 2 పార్కులు ఫార్ములా 1 రేస్ ఏరియా - డిస్ట్రిక్ట్ 7కి వెళ్లే వీధుల పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. వాటి మొత్తం వైశాల్యం 28వేల చదరపు మీటర్లు మించిపోయిది. పిల్లల ఆటలు, ఈవెంట్‌లు, బహుళ వినియోగ స్క్వేర్, సైకిల్ పాత్, పచ్చని ప్రదేశాలు, పెట్టుబడి ప్రాంతాల కోసం నిర్దేశిత ప్రాంతాలను కలిగి ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com