విడుదలకు సిద్ధం గా ఉన్న 'అవసరానికో అబద్ధం'

- July 03, 2016 , by Maagulf
విడుదలకు సిద్ధం గా ఉన్న 'అవసరానికో అబద్ధం'

టాలీవుడ్ దర్శక నిర్మాతలు హర్రర్ చిత్రాలతో సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్రిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నయి. తాజాగా 'అవసరానికో అబద్ధం' అనే టైటిల్ తో ఓ హరర్ మూవీ తెరకెక్కుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్టు సమచారం. చక్రం క్రియోషన్స్ మరియు శ్రేయాస్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ సంయుక్తంగా రూపోందిస్తున్న చిత్రం 'అవసరానికో అబద్ధం'. సురేష్ కె.వి దర్శకత్వం వహిస్తూ తన స్నేహితులు విజయ్‌.జె తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిమనిషి అవసరానికి ఖచ్చితంగా అభద్దం ఆడి తీరతారు అయితే అలా ఆడిన అబద్దం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనే కాన్సెప్ట్ తో ఉత్కంఠగా తెరకెక్కించారు. ఈచిత్రానికి సంబందించిన ట్రైలర్ ని తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com