తెలంగాణ: ఆ ఇద్దరు ఐపిఎస్ లు రిలీవ్...పెండింగ్ లో కరీంనగర్ సీపీ
- February 22, 2025
హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ ముగ్గురు అధికారులను వెంటనే ఆంధ్రాకు రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రత డీజీగా కొనసాగుతున్న అంజనీకుమార్, పోలీస్ ట్రైనింగ్ డిజిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తాలను తెలంగాణ ప్రభుత్వం నేడు రిలీవ్ చేసింది.. ఈ ఇద్దరు అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎపిలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించింది.. ఇక ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని రిలీవ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచింది.. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా కోడ్ అమలవుతున్నది.. దీంతో ఆయన రిలీవ్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.. అక్కడి నుంచి సమాధానం వచ్చిన తర్వాత అభిషేక్ రిలీవ్ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







