కొత్త మల్టీ ఎంట్రీ వీసా పథకాన్ని ప్రకటించిన దుబాయ్..!!
- February 23, 2025
దుబాయ్: యాచ్ సిబ్బంది ఇప్పుడు దుబాయ్‌కి మల్టీ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకటించింది. కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసా ఆరు నెలల అమల్లో ఉంటుందని దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2025 సందర్భంగా GDRFA తెలిపింది. ఫిబ్రవరి 19న దుబాయ్ హార్బర్‌లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. ఈ వార్షిక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బోట్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా GDRFA ప్రత్యేకంగా యాచింగ్ రంగం, సముద్ర కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన సేవలను ప్రదర్శిస్తోంది. వీటిలో మొబైల్ మెరీనా, వర్క్ బండిల్, ప్లాట్‌ఫారమ్ 04, దుబాయ్ రెసిడెన్సీ కమ్యూనిటీ నెట్‌వర్క్ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో సూపర్‌యాచ్‌ల యజమానులకు గోల్డెన్ వీసాను అబుదాబి ప్రకటించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







