బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్.. మరో రెండు వారాలపాటు పొడిగింపు..!!

- February 23, 2025 , by Maagulf
బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్.. మరో రెండు వారాలపాటు పొడిగింపు..!!

మనామా: బుదయ్యాలోని సీజనల్ బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్ 12వ ఎడిషన్‌ను మరోరెండు వారాల పాటు(మార్చి 8) పొడిగిస్తున్నట్లు మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రి, హిజ్ ఎక్సలెన్సీ ఇంజి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ ప్రకటించారు.  వ్యవసాయ రంగానికి మద్దతుగా బహ్రెయిన్ నిబద్ధతకు మార్కెట్ కొనసాగింపు నిదర్శనమని మంత్రి హైలైట్ చేశారు. ఇది హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలతో ఆహార భద్రత ప్రయత్నాలను బలోపేతం చేయడంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నిరంతర మద్దతుతో తమ ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడంలో మార్కెట్ విజయం సాధించిందని తెలిపారు.  పవిత్రమైన రమదాన్ మాసంతో కలిసి వచ్చేలా మార్కెట్‌ పొడిగింపు నిర్ణయం ఉందని అల్ ముబారక్ స్పష్టం చేశారు.   రైతులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందాలని సూచించారు. తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని, అదే సమయంలో అందుబాటులో ఉన్న తాజా స్థానికంగా పెరిగిన ఉత్పత్తుల నుండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు వీలు కల్పిస్తుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com