ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్…
- February 24, 2025
హైదరాబాద్: అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది.హైటెక్ సిటీ సమీపంలో ని అమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ను నేడు లాంచనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అమ్జెన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఎ.బ్రాడ్‌వే,అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, అమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి పాల్గొన్నారు.
ఇక ఈ సంస్థ 2025 నాటికి ఈ విస్తరణ లో భాగంగా $200 మిలియన్లు (దాదాపు రూ.1600 కోట్లు) పెట్టుబడి పెడుతుంది.రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులకు ప్రణాళిక చేస్తోంది. బయో ఫార్మా రంగంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
అమ్జెన్ తమ ఔషధాల శ్రేణిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తుంది. ఏఐ, డేటా సైన్స్ తో డిజిటల్ సామర్థ్యాలను ఈ కొత్త సైట్ అందిస్తుంది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







