క్రిప్టో కరెన్సీ మాటున భారీ మోసం..దేశంలోని 60 చోట్ల సీబీఐ దాడులు
- February 26, 2025
న్యూ ఢిల్లీ: ఓ గ్యారంటీలేదు. ప్రభుత్వాల మద్దతు లేదు. బ్యాంకుల సపోర్ట్ లేదు. అయినా సరే దాని దూకుడు ముందు వజ్రం కూడా వెలవెలబోతోంది. దాని ఊపు ముందు..బంగారం కూడా ఉసూరుమంటోంది. అరపైసాతో మొదలైన దాని ప్రస్తానం..కోట్ల రూపాయలకు చేరుతోంది. కంప్యూటర్‌లో పుట్టిన డిజిటల్ కరెన్సీగా ఎదిగి.. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తోంది.
కనిపించవు కానీ…కాసులు కురిపిస్తాయి. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే, సాధిస్తే లైఫ్ సెటిల్..అంతే.. కన్ఫ్యూజింగ్ గా ఉన్నా క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అన్ని రికార్డులను చెరిపేసి దూసుకెళుతోంది.
ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన సీబీఐ రంగంలోకి దిగింది. దీని వెనుక జరుగుతున్న అసలు మోసాన్ని బట్టబయలు చేసింది.
క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన కేసుల్లో దేశవ్యాప్తంగా 60 చోట్ల సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ NCR, పూణే, చండీగఢ్, నాందేడ్, కొల్హాపూర్, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.
నకిలీ వెబ్‌సైట్‌లు మరియు ఆన్‌లైన్ మోసం ద్వారా ఈ స్కామ్ జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఇందులో నిందితులు ప్రధాన క్రిప్టో ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్‌లను అనుకరించడం ద్వారా ప్రజలను మోసం చేసినట్లు నిర్ధారించారు.
ఈ క్రిప్టోకరెన్సీ స్కామ్ 2015లో ప్రారంభమైంది. అమిత్ భరద్వాజ్ (మరణించిన వ్యక్తి), అజయ్ భరద్వాజ్, వారి ఏజెంట్లు దీనిని నిర్వహించారు. ఈ వ్యక్తులు GainBitcoin పేరుతో అనేక ఇతర పేర్లతో వెబ్‌సైట్‌లను సృష్టించారు.
పోంజీ పథకం కింద ప్రజలను క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేలా చేశారు. ఈ వెబ్‌సైట్‌లన్నీ వేరియబుల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడిన అమిత్ భరద్వాజ్(మరణించిన), అజయ్ భరద్వాజ్, ఈ పథకంలో 18 నెలల పాటు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టమని పెట్టుబడిదారులను కోరారు.
దానికి ప్రతిగా వారు 10 శాతం రాబడిని ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులు ఎక్స్ఛేంజీల నుండి బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయమని, క్లౌడ్ మైనింగ్ కాంట్రాక్టుల ద్వారా గెయిన్‌బిట్‌కాయిన్‌తో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







