రియాద్‌లోని ఖాసర్ అల్-హుక్మ్ డౌన్‌టౌన్ మెట్రో స్టేషన్ ప్రారంభం..!!

- February 26, 2025 , by Maagulf
రియాద్‌లోని ఖాసర్ అల్-హుక్మ్ డౌన్‌టౌన్ మెట్రో స్టేషన్ ప్రారంభం..!!

రియాద్: రియాద్ మెట్రో నెట్‌వర్క్‌లోని ఖాసర్ అల్-హుక్మ్ డౌన్‌టౌన్ స్టేషన్  కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రియాద్ నగరానికి రాయల్ కమిషన్ ప్రకటించింది. ఇది నెట్‌వర్క్‌లోని నాలుగు ప్రధాన స్టేషన్లలో ఒకటని తెలిపింది. మెట్రో బ్లూ,  ఆరెంజ్ లైన్‌లను బస్సు రవాణా నెట్‌వర్క్‌తో అనుసంధానించే కీలకమైన కేంద్రమని పేర్కొంది. రియాద్ మధ్యలో ఉన్న ఖాసర్ అల్-హుక్మ్ ప్రాంతంలోని పరిపాలనా సౌకర్యాలు, రాజభవనాలు, చారిత్రక మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపింది.  

ఖస్ర్ అల్-హుక్మ్ స్టేషన్ సల్మానీ ఆర్కిటెక్చర్ ను ఆధునికంగా డిజైన్ చేశారు. దాంతో స్టేషన్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటుంది.స్టేషన్‌లో ఒక వినూత్నమైన గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణీకులు తమ రైలు ప్రయాణాల కోసం వేచి ఉన్నప్పుడు ఆహ్లాదాన్ని పంచుతుందని ప్రకటించారు.  

ఈ స్టేషన్ 22,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 35 మీటర్ల భూగర్భ లోతుతో ఏడు అంతస్తులతో కూడిన 88వేల చదరపు మీటర్ల భవన ఉపరితలాలపై నిర్మించారు. ఇందులో 17 ఎలక్ట్రిక్ ఎలివేటర్లు, 46 ఎస్కలేటర్లతోపాటు అనేక దుకాణాలు, సేవలు, ప్రజా సౌకర్యాలు, పెయింటింగ్‌లు, కళాత్మక శిల్పాలను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com