విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారికి 'పీకేవీవై' భాగంగా శిక్షణ
- July 03, 2016
పని కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన(పీకేవీవై)పథకంలో భాగంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార కల్పన శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు శిక్షణ ఇస్తారు. విదేశాలకు పని కోసం వెళ్లే భారతీయులు సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల పలు అవమానాలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఈ పరిస్థితి ఎదురవుతుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించే వారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన ఒక మైలురాయి వంటిదని, నైపుణ్యం పెంచుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది పని నిమిత్తం 7 నుంచి 8 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే చెప్పారు. వీరిలో గల్ఫ్‌కు వెళ్లే ఎక్కువ మందికి అక్కడి నిబంధనలు, భాష, సంస్కృతి గురించి సరైన పరిజ్ఞానం ఉండడం లేదన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







