అమెరికా వ్యాప్తంగా అప్పుడే మొదలైన సంబరాలు
- July 03, 2016
జులై 4, 1776న స్వాతంత్రం వచ్చిన రోజును పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. శని, ఆది వారాలకు అదనంగా జులై 4 సోమవారం రావడంతో బిగ్ వీకెండ్‌గా అమెరికన్లు ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ముఖ్య నగరాల్లో ఎత్తైన భవనాలకు అమెరికా జాతీయ పతకం రంగులు వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల పండగ వాతావరణం ఉట్టిపడుతోంది. స్పెషల్ డిస్కౌంట్లతో షాపింగ్ బిజీ బిజీగా జరుగుతోంది. ఫుడ్ స్టాళ్లు, ఈటరీలలో స్పెషల్ డిష్‌లు ఏర్పాటు చేశారు. వరుసగా మూడు రోజులు సెలవు కావడం, దానికి తోడు ఇండిపెండెన్స్ డే రావడం అమెరికన్లలో ఉత్సాహం తెచ్చిపెట్టింది.చికాగోలో ఘనంగా ఇండిపెండెన్స్ డే జులై 4కు రెండు రోజుల ముందే చికాగోలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చికాగోలో సముద్రాన్ని తలపించేలా ఉన్న ఓ భారీ లేక్ కు సమీపంలో నావికదళ అధికారులు.. ఘనంగా సంబరాలు జరిపారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. అమెరికాలో జరిగే అతి పెద్ద ఫైర్ వర్క్స్ లో ఇది ముఖ్యమైనది. చికాగోలో జరుగుతున్న ఈ బాణా సంచా కార్యక్రమాన్ని చూసేందుకు వేర్వేరు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు. స్కైడెక్ పేరుతో చికాగో డౌన్ టౌన్‌లో ఉన్న అతి ఎత్తైన భవనం నుంచి ఫైర్ వర్క్స్ చూడడం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టం. వీకెండ్ కావడం, బాణా సంచా కార్యక్రమం ఉండడంతో స్కైడెక్ వద్ద భారీ క్యూలు కనిపించాయి. 103వ అంతస్తు పైకి వెళ్లి అద్దాల గదిలో ఉండి ఫైర్ వర్క్స్ చూడడం ఓ మధురమైన జ్ఞాపకం. 94వ అంతస్తులోని ఓ గదిలో మరో ప్రత్యేకత ఉంది. పూర్తిగా అద్దాలతో నిండి ఉండే ఈ గది ప్రత్యేకమైన ఏర్పాట్లతో బిల్డింగ్ ముందుకు ఊగుతూ బయటికి వస్తుంది. వెంట్రుకలు నిక్కబొడిచే ఉద్విగ్నంతో ఎక్కడ కింద పడిపోతామో అన్న భయంతో ఉత్కంఠ మధ్య గడుస్తుంది.స్కై స్క్రాపర్‌లోనూ ఇలాంటి ఏర్పాటు ఉంది. వంద అంతస్తులకు పైగా ఉన్న ఈ భవనంలో ఓ గది మాత్రం కొన్ని అడుగులు అద్దాలతో ముందుకు కట్టారు. పూర్తిగా పారదర్శకంగా ఉండే ఈ గదిలో ఒక్క నిమిషం ఉండాలాన్న ఎంతో ధైర్యం కావాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







