ఈ-స్కూటర్ ప్రమాదంలో 15 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి..!!
- February 28, 2025
దుబాయ్: రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల భారతీయ విద్యార్థి, బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్యాడ్మింటన్ మృతి చెందారు. ఫిబ్రవరి 25 సాయంత్రం జులేఖా హాస్పిటల్‌కు సమీపంలోని అల్ నహ్దా సమీపంలో ఇ-స్కూటర్ ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 27న అసర్ ప్రార్థనల అనంతరం దుబాయ్‌లోని ఖుసైస్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దుబాయ్‌లోని బ్యాడ్మింటన్ సంఘం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెకు తోటి క్రీడాకారులు, కోచ్‌ల నుండి నివాళులర్పించారు.
గత సంవత్సరం దుబాయ్ సైకిళ్లు, ఇ-స్కూటర్లకు సంబంధించి 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. అవసరమైన పరికరాలు లేని లేదా హెల్మెట్ మరియు వెస్ట్ నిబంధనలను పాటించని సైకిళ్లు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రయాణీకులను తీసుకెళ్లకుండా అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే 200 దిర్హామ్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణీకులను తీసుకెళ్తే 300 దిర్హామ్‌లు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







