సంపత్ నంది, గోపిచంద్ ల కాంబినేషన్లో కొత్తచిత్రం

- July 03, 2016 , by Maagulf
సంపత్ నంది, గోపిచంద్ ల కాంబినేషన్లో కొత్తచిత్రం

గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీ 'ఆక్సిజన్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా మరో కొత్త సినిమాకు గోపిచంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 'రచ్చ'తో మాస్ డైరెక్టర్‌గా మెప్పించిన సంపత్ నంది..తర్వాత మాస్ మహారాజా రవితేజను 'బెంగాల్ టైగర్'గా తెరమీదకు తీసుకొచ్చాడు. తర్వాత చరణ్‌తో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.. చరణ్‌కి కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో...గోపీచంద్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com