పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టేసిన శ్రీకాంత్

- July 03, 2016 , by Maagulf
పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టేసిన శ్రీకాంత్

ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే హీరో శ్రీకాంత్‌ పైకి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. అయితే... సాహస కృత్యాలు చేయాలనే కోరిక ఆయనలోనూ బలంగానే ఉంది. ఎంతోకాలంగా అనుకుంటున్న లాంగ్ రోడ్ డ్రైవ్ కోరికను శ్రీకాంత్ ఈ నెలలో తీర్చుకున్నారు. తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ బయలుదేరి పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టి వచ్చారు. ఢిల్లీ, శ్రీనగర్ మీదుగా కార్గిల్‌కు వెళ్ళి... అక్కడి అమరవీరుల సమాధి దగ్గర నివాళులు అర్పించారు శ్రీకాంత్. అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్‌లో శ్రీకాంత్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణం చేయగల ప్రపంచంలోని ఎత్తైన (18380 అడుగులు) ప్రదేశం ఖర్దుంగ్లాను శ్రీకాంత్ మిత్ర బృందం దర్శించింది. అదే దారిలో సెకండ్ హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టగ్లాంగలానూ వీరు చూసొచ్చారు. లడక్ నుండి లే కు వెళ్ళి... అక్కడ నుండి మనాలి మీదగా హైదరాబాద్ చేరారు. చిరకాల కోరిక తీరిపోయినందుకు ఆనందంగా ఉన్నా... ఆ పది రోజుల ఘాట్ రోడ్ ట్రిప్‌ను తలుచుకుంటే... ఇప్పుడు భయం కలుగుతోందని శ్రీకాంత్ నవ్వుతూ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com