సంపత్ నంది, గోపిచంద్ ల కాంబినేషన్లో కొత్తచిత్రం
- July 03, 2016
గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీ 'ఆక్సిజన్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా మరో కొత్త సినిమాకు గోపిచంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 'రచ్చ'తో మాస్ డైరెక్టర్‌గా మెప్పించిన సంపత్ నంది..తర్వాత మాస్ మహారాజా రవితేజను 'బెంగాల్ టైగర్'గా తెరమీదకు తీసుకొచ్చాడు. తర్వాత చరణ్‌తో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.. చరణ్‌కి కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో...గోపీచంద్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







