బహ్రెయిన్ లో పేద సాదలకు అన్నదానం
- July 11, 2015
బహ్రెయిన్ లో రమదాన్ సందర్భంగా నేమహ్ సొసైటీ అనే మతప్రమేయం లేని స్వచ్చంద సంస్థకు చెందిన వాలెంటీర్లు ఇల్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఎంగిలిచేయబడని ఆహారాన్ని సేకరిoచి, మరల ప్యాక్ చేసి వాటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. ఈ సొసైటీ ఉపాద్యక్షులు అహ్మద్ అల్ మహ్మూద్ మాట్లాడుతూ, గత సంవత్సరం రమదాన్ లో 3400 భోజనాలు అందించామని, ఈ సంవత్సరం రమదాన్ మధ్యలోనే ఈ సంఖ్యకు చేరగలగడం ఆనందంగా ఉందన్నారు. గత ఫెబ్రవరిలో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటివరకు 10, 000 మందికి అన్నదనం చేసిందని, అందుకు తోడ్పడిన శ్రేయోభిలాషులకు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సంవత్సరమంతా కొనసాగిస్తామని కూడా తెలిపారు. వాలంటీర్లు కావాలనుకునేవారు - ఇన్స్టగ్రాం ఐ డి - @ne3mahsave కు, దానం చేయాలనుకునేవారు - ఫోన్ నంబర్లు - 39674786 లేదా 36660009 కు సంప్రదించవచ్ఛని తెలిపారు.
--యం.వాసుదేవ్ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







