సురక్షిత ప్రయాణానికి ట్విట్టర్ ద్వారా ఖతార్ మార్గదర్శకాలు

- July 11, 2015 , by Maagulf
సురక్షిత ప్రయాణానికి ట్విట్టర్ ద్వారా ఖతార్ మార్గదర్శకాలు

ఖతార్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారు పౌరులకు, ప్రవాసీయులకు కూడా అపరిచితుల నుండి ఏ విధమైన బాగులను, సామానును తీసుకోవద్దని, వానిలో నిషేధిత పదార్ధాలు ఉంటే చిక్కులలో పడవలసి ఉంటుందని హెచ్చరించారు. 'Safe Travel" అనే పేరుతో ఈశాఖవారు వేసవి సెలవుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్న వారికి సురక్షా సూత్రాలు తెలియజేశారు. అవసరమైతే ఎక్స్ప్రెస్ బ్యాగేజ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. చాలా పాఠశాలల్లో ఈనెల మొదటివారం నుండి సెప్టెంబర్ మొదటివారం వరకు సెలవులు ప్రకటించిన నేపధ్యంలో - పాస్పోర్టు, వీసా, ఏర్ టికెట్లు, ఎగ్సిట్ పెర్మిట్లు వంటివాటిని, రెసిడెన్సీ పర్మిట్ గడువును  దాటిపోకుండా సరిచూసుకోవాలని, తమ స్మార్ట్ కార్డ్ లతో e గేట్ ను ఆక్టివ్ చేయడం ద్వారా సమయ వృధాను అరికట్టవచ్చునని తెలియజేశారు. తమ గృహ ద్వారాలను సరిగా ముసి ఉంచాలని, నగదు, బంగారం, ఆభరణాలు వంటివాటిని బాంకులలో ఉంచాలని, గ్యాస్ పైపులు, ఎలక్ట్రానిక్, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేసి ఉంచాలని, టైర్లను అవసరమైనపుడు మారుస్తూ ఉండాలని, సీట్ బెల్ట్ ధరించడం, ప్రధమ చికిత్స, అగ్ని నిరోధక పరికరాలు ఉంచుకోవడం తప్పనిసరి అని ఈ సూచనలో తెలియచేశారు.


--వి రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com