దుబాయ్ జుమేరా విలేజ్ సర్కిల్‌లో వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్..!
- March 03, 2025
దుబాయ్: దుబాయ్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. కీలక అభివృద్ధి ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA), దుబాయ్ హోల్డింగ్ 6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేశాయి. దుబాయ్‌లోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాలను తగ్గించడం, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా కొత్త బ్రిడ్జీలు, రోడ్లు, యాక్సెస్ పాయింట్ల నిర్మాణంతోపాటు రోడ్డు విస్తరణను చేపట్టనున్నారు.
దుబాయ్ దీవులు, జుమేరా విలేజ్ ట్రయాంగిల్, పామ్ గేట్‌వే, అల్ ఫుర్జాన్, జుమేరా పార్క్, అర్జన్, మజాన్, లివాన్ (ఫేజ్ 1), నాద్ అల్ హమర్, విల్లానోవా, సెరెనాతో సహా ఎమిరేట్ అంతటా కీలక అభివృద్ధి పనులు, ప్రాజెక్టులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఒప్పందంలో భాగంగా జుమేరా విలేజ్ సర్కిల్, దుబాయ్ ప్రొడక్షన్ సిటీ, బిజినెస్ బే, పామ్ జుమేరా, ఇంటర్నేషనల్ సిటీ (ఫేజ్ 3) అనే ఐదు కీలక దుబాయ్ హోల్డింగ్ అభివృద్ధి పనులకు యాక్సెస్ పాయింట్లను మెరుగుపరచడానికి బ్రిడ్జీలు, రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!